DSLR కెమెరాతో ఫిల్మీలుక్
ఫోటోస్పాట్ : చాలా మంది ఫోటో & వీడియోగ్రాఫర్లు అడుగుతువుంటారు DSLR తో తీసిన ఫుటేజ్ ని ఎలా కలర్ కరెక్షన్ చేయాలి? ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఏం చెయ్యాలి? అని. దానికి సమాధానం ఏంటంటే ముందుగా షూట్ కి వెళ్ళే ముందు మీరు ఏ రకమైన షూట్ చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి
ఫోటోస్పాట్ : చాలా మంది ఫోటో & వీడియోగ్రాఫర్లు అడుగుతువుంటారు DSLR తో తీసిన ఫుటేజ్ ని ఎలా కలర్ కరెక్షన్ చేయాలి? ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఏం చెయ్యాలి? అని. దానికి సమాధానం ఏంటంటే ముందుగా షూట్ కి వెళ్ళే ముందు మీరు ఏ రకమైన షూట్ చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఫ్యామిలి, డ్రామా, హర్రర్, డాక్యుమెంటరీ వంటివి. మీరు తీసుకున్న అంశాన్ని బట్టి తీసే లుక్ ఎలా ఉండాలో ఇంతకముందు సేమ్ జోనర్ లో వచ్చినటువంటి మూవీ చూస్తే మీకు అర్ధం అవుతుంది. దానికి అనుగుణంగా కెమెరా సెట్టింగ్స్ మార్చుకోవాలి. 24fps, Depth of Field F/1.2 -F/4, కలర్, contrast, saturation వంటి సెట్టింగ్స్ చేసుకోవాలి. Picture స్టైల్ తప్పకుండా మార్చవలసి ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కెమెరాల సెట్టింగ్స్ లో కస్టమ్ స్టైల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ కి అంత ఉపయోగకరమైనది కాదు ఎందుకంటే ఎక్కువ కాంట్రాస్ట్ మరియు saturation ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో కలర్ కరెక్షన్ చేయడానికి పిక్చర్ ని ఫ్లాట్ పిక్చర్ స్టైల్ లో shoot చేయాలి. దీనికోసం కాంట్రాస్ట్ సెట్టింగ్స్, saturationని తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్ని కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో చేసుకుంటే మంచిది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే sharpness. మీరు తీసిన వీడియో యూట్యూబ్ లేదా vimeo వంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి అయితే sharpness తగ్గించాల్సిన అవసరం లేదు, అదే మీరు తీసిన వీడియో బిగ్ స్క్రీన్, టీవీ స్క్రీన్ మీద ప్రొఫెషనల్ లుక్ కనపడాలంటే మీరు ఖచ్చితంగా షార్ప్ నెస్ తగ్గించాలి. పోస్ట్ ప్రొడక్షన్ లో కలర్ కరెక్షన్ గురించి ముందే ఆలోచించుకొని ఈ నియమాలు పాటిస్తే సినిమాటిక్ లుక్ వస్తుంది.
బేసిక్ సెట్టింగ్స్ అన్ని కూడా అనగా ISO, షటర్ స్పీడ్, అపాచ్యుర్ ముందే సెట్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఓవర్ షాట్ లేదా ఓవర్ ఎక్స్పోజర్ వంటివి రావడం జరుగుతుంది. దీని వలన డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. ఒక సారి డీటెయిల్స్ మిస్ అయ్యాక చేయడానికి ఏమి ఉండదు. ఒక వేళ ఫుటేజ్ డార్క్ లో ఉన్నట్లయితే డీటెయిల్స్ మిస్ అవకుండా పోస్ట్ ప్రొడక్షన్ లో కరెక్షన్ చేయవచ్చును. కొంచెం నాయిస్ వస్తుంది కానీ డీటెయిల్స్ రాకుండా ఉండటం కంటే కొంచెం నాయిస్ అనేది మంచిదే .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?