అనపర్తి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ వీరులమ్మ తల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అనపర్తి వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి లో గల శ్రీ తేతలి రామిరెడ్డి మంగయమ్మ చారిటీస్ మహిళ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపారు.

Aug 19, 2023 - 18:05
Aug 19, 2023 - 18:11
 0  22
అనపర్తి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ వీరులమ్మ తల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అనపర్తి వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి లో గల శ్రీ తేతలి రామిరెడ్డి మంగయమ్మ చారిటీస్ మహిళ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనపర్తి శాసనసభ్యులు  సత్తి సూర్యనారాయణ రెడ్డి  విచ్చేసి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న సమారాధన చేసి వృద్ధాశ్రమం ఆవరణంలో ఎమ్మెల్యే  చేతుల మీదుగా చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రెటరీ తేతలి నారాయణ రెడ్డి,  ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం గౌర అధ్యక్షులు సాయి, నరసింహారావు , అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ మహేష్, ట్రెజరీ నాగలక్ష్మి, పి.ఆర్.ఓ సతీష్, జాయింట్ సెక్రటరీ సుబ్బు,మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow