మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుక లు
ఫోటోస్పాట్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం రోజున రామకృష్ణాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక ఠాగూర్ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి యూనియన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ లు పాల్గొని తోటి ఫోటోగ్రాఫర్ల తో కలసి కేక్ కట్ చేశారు.

ఫోటోస్పాట్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం రోజున రామకృష్ణాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక ఠాగూర్ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి యూనియన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ లు పాల్గొని తోటి ఫోటోగ్రాఫర్ల తో కలసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటో గ్రఫీకి విడదీయలేని బంధం ఉందన్నారు.వెయ్యి మాటలు చెప్పలేని భావాలను ఒక్క ఫోటోతో చెప్పవచ్చని, అలాంటి అద్భుత కళ ఫోటోగ్రఫీ అని కొనియాడారు.ఫోటోగ్రాఫర్స్ తమ వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పురోభివృద్ధి సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉదయ్, నాగేందర్ ,కనకరాజు,బద్రి సతీష్, జి. శ్రీనివాస్, కుమార్, అరుణ్ కుమార్, ఇ.శ్రీనివాస్,సతీష్, రమేష్, గిరి, వెంకటేష్, సతీష్, సందాని, రాజు, స్వామి, రవి, నాగరాజు, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు..
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






