వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్ : వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం వనస్థలిపురంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవాలయం నందు ఎలక్షన్ కమిటీ మెంబర్ ఎస్బి ఎన్ చారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నూతన కమిటీగా బాధ్యత వహిస్తున్న శీలం రామ్ రెడ్డి అధ్యక్షుడిగా,

Jul 25, 2024 - 23:01
 0  97
వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్ : వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం వనస్థలిపురంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవాలయం నందు ఎలక్షన్ కమిటీ మెంబర్ ఎస్బి ఎన్ చారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నూతన కమిటీగా బాధ్యత వహిస్తున్న శీలం రామ్ రెడ్డి అధ్యక్షుడిగా, ఎం సాయి వర్మ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా రాంప్రసాద్ తో పాటు మిగతా సభ్యులను ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సేవలు అమోఘం... కష్ట నష్టాలకి ఓర్చి ఫోటోగ్రఫీని వృత్తిని ఎంచుకొని వెళ్తున్నటువంటి ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు వెంటనే ప్రభుత్వం ద్వారా అలాగే రాష్ట్ర కమిటీ ద్వారా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... అందరికీ అవసరం ఉన్న ఫోటోగ్రాఫర్ మరియు వీడియో గ్రాఫర్ల ఔన్నత్యం ఎంతో గొప్పదని, తల ఎత్తుకునేలా చేసేది, తల దించుకునేలా చేయడం కూడా కేవలం ఫోటోగ్రాఫర్లకు మాత్రమే సొంతమని వ్యాఖ్యలు చేశారు... రాష్ట్రంలో ఇప్పటివరకు 102 మందికి ఒక కోటి 60 లక్షల రూపాయలు కుటుంబ భరోసా ద్వారా అందజేశామని, మునుముందు కూడా ప్రమాద బీమా తో సభ్యులకు సేవలు చేయుటకు ముందుకు వస్తున్నామని తెలిపారు... రేపటి నుంచి మూడు రోజులపాటు మన్సురాబాదులో ఉన్న కేబీఆర్ పార్కులో ఏర్పాటుచేసిన ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలని కోరారు.వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శీలం రామ్ రెడ్డి మాట్లాడుతూ మా మీద మరింత బాధ్యత పెంచిందని సభ్యులకు రానున్న రోజుల్లో అనేక సేవలు చేయడానికి మా కార్యవర్గం ద్వారా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాన కార్యదర్శి సాయి వర్మ మాట్లాడుతూ... ఒక ఫోటోగ్రాఫర్ గాని ఒక వీడియో గ్రాఫర్ కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి కుటుంబానికి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తామని తెలిపారు.... కార్యక్రమంలో నూతన కార్యవర్గమైన ఉపాధ్యక్షులు లచ్చ గారి వెంకటేష్ మల్లెల బాలకిషన్, జాయింట్ సెక్రటరీలుగా రవి, వెంకటేశ్వరరావు, సుశాంతి యాదవ్ లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆంజనేయులు తో పాటు ఎలక్షన్ కమిటీ మెంబర్స్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చింతల రవికుమార్, కనకదుర్గ దేవాలయం చైర్మన్ భుజంగ రెడ్డి, స్ఫూర్తి సేవా ఫౌండేషన్ అధినేత సంజయ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శ కోశాధికారి, వివిధ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు, అసోసియేషన్ సభ్యులు,  పాల్గొన్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow