పట్వ ఆధ్వర్యంలో లూయిస్ మండే డాగురె గారికి 173 వ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు
ఫోటోస్పాట్ : కెమెరాసృష్టికర్త అయిన లూయిస్ మండే డాగురె గారి 173 వ వర్ధంతి సందర్భంగా పట్వ( ఫోటోగ్రఫీ అండ్ ఎలైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో అరండలపేట ఆరో లైన్ పట్వా ఆఫీస్ నందు డాగురె గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఫోటోస్పాట్ : కెమెరాసృష్టికర్త అయిన లూయిస్ మండే డాగురె గారి 173 వ వర్ధంతి సందర్భంగా పట్వ( ఫోటోగ్రఫీ అండ్ ఎలైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో అరండలపేట ఆరో లైన్ పట్వా ఆఫీస్ నందు డాగురె గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాగురె గారి చిత్రపటానికి పూలమాల వేసి పలువురు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్వ చైర్మన్ కె. కృష్ణ గారు మాట్లాడుతూ కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే గారి ఆలోచన విధానంతోనే నేటి ప్రపంచం ప్రతి చోట వైద్యరంగం, ఆర్మీ,రైల్వే, పోలీస్,మీడియా, సినిమా, అంతరిక్షం రంగం,ఇలాఅనేక రంగలలో సామాన్యుడు చేతిలో ఫోన్ రూపంలో ప్రతి ఒకరి చేతిలో కెమెరా ను ఉపగుగిస్తున్నారు అంటే ఆనాడు డాగురే గారి ఆలోచన విధానమే అన్ని ఈనాడు ప్రపంచ స్థాయిలో అనేక కోట్ల మంది ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనోపాధి పొంది జీవన మనుగడను సాగిస్తున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి గుంటూరు నగరంలో విగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పట్వ చైర్మన్ కమిటీ నెంబర్ శ్రీమన్నారాయణ. పట్వా ప్రెసిడెంట్ సంకా శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ ఆ. M షరీఫ్ జాయింట్ సెక్రెటరీ కొణిదె.దుర్గాప్రసాద్ కమిటీ సభ్యులు రఫీ,కిషోర్, శ్రీనివాస్, పుజాశ్రీను, లక్ష్మణ, ధనుంజయ్ పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?