కాకినాడ ఫోటో ఫినా2024, మెగా ఎగ్జిబిషన్ఆ విష్కరణ
ఫోటోస్పాట్ : ది 10-7-2024 బుధవారం స్థానిక ఆర్.ఎల్.గ్రాండ్ హోటల్ నందు కాకినాడ ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్స్ అండ్ మిక్సింగ్ యూనిట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సర్వ సభ్య సమావేశం జరిగింది.కార్యక్రమంలో సోనీ కంపెనీ వారిచే వర్క్ షాప్ మరియు ఆగస్టు 3,4 తేదీలలో కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జరిగే కాకినాడ ఫోటో ఫినా ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో సోనీ కంపెనీ నుండి టెక్నికల్ ఇంజనీర్ చైతన్య కృష్ణ స్థానిక ఫోటోగ్రాఫర్స్ కు వీడియో గ్రాఫర్స్ కు కెమెరాలోని మెలకువలను వివరించారు..
ఫోటోస్పాట్ : ది 10-7-2024 బుధవారం స్థానిక ఆర్.ఎల్.గ్రాండ్ హోటల్ నందు కాకినాడ ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్స్ అండ్ మిక్సింగ్ యూనిట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సర్వ సభ్య సమావేశం జరిగింది.కార్యక్రమంలో సోనీ కంపెనీ వారిచే వర్క్ షాప్ మరియు ఆగస్టు 3,4 తేదీలలో కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జరిగే కాకినాడ ఫోటో ఫినా ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో సోనీ కంపెనీ నుండి టెక్నికల్ ఇంజనీర్ చైతన్య కృష్ణ స్థానిక ఫోటోగ్రాఫర్స్ కు వీడియో గ్రాఫర్స్ కు కెమెరాలోని మెలకువలను వివరించారు.. అనంతరం కాకినాడ ఫోటో ఫినా, మెగా ఎగ్జిబిషన్ కి సంబంధించిన పోస్టర్ ను ప్రెసిడెంట్ ఎం రమేష్, డిజిటల్ ఇన్విటేషన్ ను కాకినాడ జిల్లా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు తోట చంటి బాబు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు ముద్దన వీరబాబు మాట్లాడుతూ అనేక జాతీయ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఉత్పత్తులతో జరిగే ఈ కాకినాడ ఫోటో ఫినా ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సభ్యులకు ఐడి కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గౌరవ అధ్యక్షులు జస్వంత్ శ్రీను కోశాధికారి ఖమురు, కాకినాడ నాలుగు అసోషియేషన్ల అద్యక్షులు,పెద్దలు విచ్చేశారు. సెక్రటరీ సుప్రీం సత్తిబాబు,వైస్ ప్రెసిడెంట్ దేవీకాంత్,ట్రెజరర్ ఎం.భాస్కర్, ఆర్ కె, సదాశివ , తదితర కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు..
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?