సుప్రీంకోర్టు న్యాయవాదిగ APPTW ఘంటా అధ్యక్షులు విజయ నాగ సురేష్
ఫోటోస్పాట్ : పశ్చిమగోదావరి జిల్లా, ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఘంటా విజయ నాగ సురేష్ సుప్రీంకోర్టు న్యాయవాదిగ నియమితులైన సందర్భంగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫోటోస్పాట్ : పశ్చిమగోదావరి జిల్లా, ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఘంటా విజయ నాగ సురేష్ సుప్రీంకోర్టు న్యాయవాదిగ నియమితులైన సందర్భంగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ నటరాజ్( గిరి ),ఉపాధ్యక్షులు రంగ సూరి ,కార్యదర్శి కాళ్ల నాగు,గౌరవ అధ్యక్షులు పోశినశెట్టి మురళి ,ఏలేటి న్యూటన్లు వేదికపై మాట్లాడుతూ భీమవరం ఫోటోగ్రఫీ వ్యవస్థకు మూలాలైన ఘంటా సూర్యారావు మనవడుగా, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఘంటా వెంకటేశ్వర రావు కుమారునిగా ఫోటోగ్రఫీ వ్యవస్థను గౌరవిస్తూ, విద్యలో రాణించి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఘంటా విజయ నాగ సురేష్ అర్హత సాధించాడని, భవిష్యత్తులో భీమవరానికి సంబంధించిన కీలకమైన కేసుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి న్యాయం చేయడానికి కృషి చేయాలని సురేష్ గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగం లో నా వెన్నంటే ఉంటూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు , నాకు అన్నం పెట్టిన ఫోటోగ్రఫీ ని నేను ఎన్నడూ మరచిపోను అని ఎంతటి ఉన్నత పదవులు వచ్చిన ఫోటోగ్రఫీని మరిచి పోను అని , ఈ క్రాక్యమాన్ని నిర్వహించి నాకు ఇంతటి సత్కారాన్ని అందించిన ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరిలందరికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు . కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, అసోసియేషన్ కోశాధికారి శరణం అయ్యప్ప, ఆదిత్య బాబి, రాకేష్ బాబు, చంద్రశేఖర్లు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?