ఫోటో గ్రాఫర్ మహాలక్ష్మి కి నంది అవార్డు పురస్కారం

ఫోటోస్పాట్ : నరసరావుపేట  ముద్దుబిడ్డ మహిళా ఫోటో గ్రాఫర్ మహాలక్ష్మి కి అరుదైన గౌరవం. కేంద్రప్రభుత్వ నంది అవార్డు పురస్కారం అందుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా

Mar 21, 2023 - 11:18
Mar 21, 2023 - 11:19
 0  109
ఫోటో గ్రాఫర్ మహాలక్ష్మి కి నంది అవార్డు పురస్కారం

ఫోటోస్పాట్ : నరసరావుపేట  ముద్దుబిడ్డ మహిళా ఫోటో గ్రాఫర్ మహాలక్ష్మి కి అరుదైన గౌరవం...
కేంద్రప్రభుత్వ నంది అవార్డు పురస్కారం అందుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా ఫోటోగ్రాఫర్ కారచోల మహాలక్ష్మి కి కేంద్రప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో వివిధ రంగాలలో  అత్యుత్తమ సేవలను అందించిన వారికి ఉగాది పండుగ సంధర్భంగా  నంది పురస్కారములను కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక సభ్యురాలు డా॥యస్.పి.భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన నందిపురస్కార అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, నటుడు ఆర్ .నారాయణ మూర్తి హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ రంగాలలో ప్రజలకు ఉత్తమ సేవలనుఅందించిన వారికి నంది అవార్డు పురస్కారములను అందజేశారు.వీరిలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు చెందిన కారచోల మహాలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ గా ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలను కేంద్రప్రభుత్వం కొనియాడుతూ ఆమెకు నంది అవార్డు పురస్కారాన్ని ప్రముఖ సినీ నటులు ఆర్ .నారాయణమూర్తి చేతులమీదుగా అందజేశారు.ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో కేంద్రప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డా॥యస్.పి.భారతి మాట్లాడుతూ నాటి రోజుల్లో గాని నేటి రోజుల్లో గాని మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫోటోగ్రాఫర్ తప్పకుండా ఉంటారని ఆ ఫోటోగ్రాఫర్ మగవారే అయి ఉంటారని  అలాంటిది గత 30 సంవత్సరాల క్రితమే మహిళలు రాణించలేని వృత్తిగా భావించే ఈ ఫోటోగ్రఫీ గుర్తునే తన లక్ష్యంగా చేసుకొని  ఫోటోగ్రఫీ వృత్తిలో తన 11 ఏటే అడుగుపెట్టి  అంచలంచెలుగా ఎదుగుతూ నేటికీ కొన్ని వేల శుభకార్యాలను తన కెమెరాతో బంధించి అందరి మన్నలను పొందుతున్న  మహాలక్ష్మికి కేంద్రప్రభుత్వం తరఫున నంది అవార్డు పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం ప్రముఖ సినీ రచయిత,నటులు ఆర్ .నారాయణ మూర్తి మాట్లాడుతూ కారచోల మహాలక్ష్మి హైదరాబాద్లో  ఆసరా ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ శ్రేష్ట పురస్కారం గతంలోనే అందుకున్నారని తెలిసి చాలా సంతోషించానని మహాలక్ష్మి ఫోటోగ్రఫీ ద్వారా తనకు వచ్చిన ఆదాయంలో కొంత సమాజాభివృద్దికి కేటాయిస్తూ సమాజం పట్ల కూడా తన సేవా భావాన్ని చాటుకోవటంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృశ్య కళల అకాడమీ ఛైర్మన్ కుడుపూడి సత్య శైలజ మాట్లాడుతూ  నరసరావుపేటలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద  కుటుంబాలకు ఆసరాగా ఉండి ఎంతో చేయూత అందించిన మహాలక్ష్మి  జీవనం మహిళలందరికీ ఎంతో ఆదర్శమన్నారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్ పర్సన్ పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్ కి చెందిన ఎడిట్ పాయింట్ సంస్థ వీరి జీవితం మొత్తాన్ని ఒక కథనంగా మార్చి దటీజ్ మహాలక్ష్మి అనే పేరుతో కొన్నివేల పుస్తకాలు ప్రచురించడం ఎంతో గొప్పవిషయమని తెలిపారు.ఈ సంధర్భంగా నంది అవార్డు గ్రహీత కారచోల మహాలక్ష్మి మాట్లాడుతూ తనకు నంది అవార్డుదక్కడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వినర్ కొల్లి రమావతి,పుడమి సాహితీ వేదిక తెలంగాణా అధ్యక్షులు సిహెచ్ .బాల్ రెడ్డి,శ్రీశ్రీ అకాడమీ అంతర్జాతీయ అధ్యక్షులు డా॥కె.ప్రతాప్,ఫిలాంత్రోఫిక్ సొసైటీ అధ్యక్షులు డా॥యోనా రాజా తదితరులు పాల్గొన్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow