ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆర్ధిక సహాయం అందజేత

ఫొటో  స్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు వరంగల్ లోని కేఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిసి మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె రమేష్ అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మరణించడం  అందరికీ విధితమే

Aug 20, 2023 - 12:32
Aug 20, 2023 - 12:33
 0  20
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆర్ధిక సహాయం అందజేత

ఫొటో  స్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు వరంగల్ లోని కేఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిసి మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె రమేష్ అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మరణించడం  అందరికీ విధితమే. గతంలో ఈ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున 30000, రెడిను కలర్ ల్యాబ్ తరఫున 5000, చందన కలర్ ల్యాబ్ తరఫున 5000 వాజేడు వెంకటాపురం మండలం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరపున 12000, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంఘం నుండి కుటుంబ భరోసా సహాయం కింద లక్ష రూపాయలు గతంలో బో ల్లె రమేష్ భార్య శ్రీ లక్ష్మి కి అందించడం జరిగింది. లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా 1,60,000, అదేవిధంగా గత సంవత్సరం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 20000, అదేవిధంగా ఈ సంవత్సరం వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున ఇవ్వడం జరిగింది అంతేకాక 12 వేల విలువచేసే ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్ గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరిగింది. దీనితోపాటు వారి పిల్లల పై చదువుల నిమిత్తం ఖర్చును అంత ఉమ్మడి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భరిస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాదె లింగమూర్తిగారు ప్రధాన కార్యదర్శి గడదాసు సునీల్ గారు వాజేడు వెంకటాపురం మండలాల అధ్యక్షులు చంద్రకళ గారు పాల్గొనడం జరిగింది.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow