కెమెరా దినోత్సవం సందర్భంగా కాకినాడ లో పురాతన కెమెరాల ప్రదర్శన
ఫోటోస్పాట్ : జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా కాకినాడ కెమెరా క్లబ్ లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాలు నందు శనివారం పురాతన కెమెరాల ప్రదర్శన నిర్వహించారు. దేవాదాయశాఖ విశ్రాంత అధికారి, సీనియర్ ఫొటోగ్రాఫర్ బళ్ల జగన్నాథం గారు ప్రారంభించారు.
ఫోటోస్పాట్ : జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా కాకినాడ కెమెరా క్లబ్ లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాలు నందు శనివారం పురాతన కెమెరాల ప్రదర్శన నిర్వహించారు. దేవాదాయశాఖ విశ్రాంత అధికారి, సీనియర్ ఫొటోగ్రాఫర్ బళ్ల జగన్నాథం గారు ప్రారంభించారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా కెమెరాల విశేషాలు నేటి తరం తెలుసుకునే వీలుంటుందన్నారు. కాకినాడ కెమెరా క్లబ్ కార్యదర్శి కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రదర్శనలో సుమారు 150 ఏళ్ల క్రితం నాటి కెమెరాలు ఉంచామన్నారు. రామచంద్రపురానికి చెందిన వి. బాలకృష్ణ సేకరించిన సుమారు 500 ఫోటో , వీడియో కెమెరాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో కాకినాడ కెమెరా క్లబ్ అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ రామమూర్తి, ఉపాధ్యక్షుడు డాక్టర్ శివరామకృష్ణ, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి ఎమ్.సోమరాజు, కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ రిలేటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. సూర్య సుబ్బారావు,కార్యదర్శి కమురు, కోశాధికారి బద్రి, గౌరవాధ్యక్షుడు జశ్వంత్ శ్రీను. కాకినాడ నాలుగు అసోసియేషన్ ల కార్యవర్గ సభ్యులు,కాకినాడ కెమెరా క్లబ్ సభ్యులు మరియు వి.సుబ్రహ్మణ్యం ఎన్. బాబూరావు,సుబ్బు, పలువురు ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?