కెనాన్ R6 మార్క్ II కెమెరా..
ఫోటోస్పాట్ : canon కంపెనీ తన R6 mark ii రిలీజ్ చేసింది. R6 mark ii అనేది R3 అండ్ R6కి మినీ వెర్షన్ గా చెప్పుకోవచ్చు ఇంతకు ముందున్న వెర్షన్ 20 MP ఉండగా ఈ వెర్షన్ లో వచ్చేసరికి దానినీ 24. 2 MP కి పెంచారు .
ఫోటోస్పాట్ : canon కంపెనీ తన R6 mark ii రిలీజ్ చేసింది. R6 mark ii అనేది R3 అండ్ R6కి మినీ వెర్షన్ గా చెప్పుకోవచ్చు ఇంతకు ముందున్న వెర్షన్ 20 MP ఉండగా ఈ వెర్షన్ లో వచ్చేసరికి దానినీ 24. 2 MP కి పెంచారు . అలాగే దీనితో పాటు డై సిస్టమ్ కూడా మార్చారు మనం వీడియో ఫీచర్ నుంచి ఫోటో ఫీచర్ మార్చుడానికి సపరేట్ డైలీ బట్టన్ ని ఇవ్వడం జరిగింది . ఫుల్ వెదర్ సీల్ బాడీను కలిగి ఉంటుంది . ఇది కాండెడ్ ఫోటోగ్రాఫర్స్ కి సులువుగా ఉండే విధంగా ఫిలిప్ స్క్రీన్ ఆప్షన్ ఇచ్చారు ,ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ సెన్సార్ తో పని చేస్తుంది . వీడియో ఫీచర్ వచ్చేసరికి R6 లో 4K /60p రికార్డు చేటప్పుడు సెన్సార్ యొక్క ఫుల్ విడ్త్ నుచి ( 1. 07x ) క్రాప్ చేయబడుతుంది.అన్ని మోడ్ లో ఒక్కో వీడియోకి 30 నిముషాలకే పరిమితి కాగా R6 mark ii విషయానికి వచ్చేసరికే ఇందులో UHD 4K /60p ఏలాంటి క్రాఫింగ్ లేకుండా వీడియో రికార్డు చేయవచ్చు , అలాగే ఫుల్ సెన్సార్ విడ్త్ ఉపయోగించి 40 నిమిషాల వరకు వీడియో రికార్డు చేసుకోవచ్చు అలాగే APS -C మోడ్ లో ఉష్ణోగ్రతని భట్టి 50 నిమిషాల వరకు వీడియో రికార్డు చేస్కోవచ్చు . ఇందులో 6K వీడియో తీసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు . ఆటో ఫోకస్ విషయానికి వస్తే Canon చాల వరకు మార్పులు చేసింది , . సబ్జెక్ట్ రికగ్నిషన్ మరియు ట్రాకింగ్ కోసం ఒక కొత్త 'ఆటో' మోడ్ చాలా ఉపయోగ పడుతుంది .పాత మోడల్స్ తో పోలిస్తే R6 ii లో ట్రాకింగ్ ఫోకస్ చాల మంచి ఆప్షన్ ఇచ్చారు ,అంటే పరిగెత్తే గుర్రం కన్నును ట్రాక్ చేసే అంత మార్పులు తీసుకొని వచ్చింది. బ్యాటరీ సంబంధించి అన్ని కెమెరా లో ఉపయోగించినట్టే LP-E6NH బ్యాటరీ ని ఉపయోగించారు దీనిని పవర్ సేవింగ్ మోడ్ ని ఉపయోగించి డిఫాల్ట్ (స్మూత్) మోడ్‌లో CIPA-రేటెడ్ 580 షాట్‌లను లేదా వ్యూఫైండర్ ద్వారా ఒక్కో ఛార్జ్‌కు 320 షాట్‌లను తీసుకోవచ్చు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?