వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

ఫోటోస్పాట్ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp )లో మరో కొత్త ఫీచర్‌ ను మన ముందుకు తీసుకొచ్చింది మీట కంపెనీ . యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే..

May 19, 2023 - 16:26
 0  286
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

ఫోటోస్పాట్ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp )లో మరో కొత్త ఫీచర్‌ ను మన ముందుకు తీసుకొచ్చింది మీట కంపెనీ . యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ‘లాక్‌చాట్ (Chat Lock)’ పేరుతో వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇటీవల ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు మరో వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్‌ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్‌ లేదా ఫింబర్‌ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. అలాగే సదరు కాంటాక్ట్ నుంచి మెసేజ్‌ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్‌లో ఆ మెసేజ్‌ కనిపించదు. మనం ఏ చాట్ నైనా లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం లాక్ చేసిన వెంటనే ఇన్ బాక్స్ లో ఆ మెసేజ్ కనిపించదు. మరో ఫోల్డర్ లోకి వెళ్లిపోతుంది. ఆ ఫోల్డర్ ను పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ఫ్రింట్ తో మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. లాక్ చేసిన చాట్ నుంచి ఏ మెసేజ్, లేదంటే నోటిఫికేషన్ వచ్చినా.., ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది. ఇలా గోప్యతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి మెటా ఓ వీడియోను సైతం విడదుల చేసింది.

WhatsApp Chat Lock ఎలా ఉపయోగించాలంటే..?
మొదట మీ వాట్సాప్ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఏ చాట్ని లాక్ చేయాలని భావిస్తున్నారో దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి.
మీకు కొత్తగా 'చాట్ లాక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిసప్పియరింగ్ మెసేజ్ మెనూ కింద కనిపిస్తుంది.
ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి.
వెంటనే చాట్ లాక్ అవుతుంది.
లాక్ చేసిన చాట్ను చూడాలంటే మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయాలి.
మీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లాక్ కనబడుతుంది

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow