వాట్సాప్ లో ఈ ఆప్షన్ గమనించారా ?
ఫోటోస్పాట్ : స్మార్ట్‌ఫోన్ ఉన్న వారిలో అందరూ వాట్సాప్ యాప్‌ను వాడుతున్నారు. కంపెనీ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ.. సరికొత్త అప్‌డేట్లతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వాట్సాప్ అంటేనే క్షణాల్లో మెసెజెస్ సెండ్ చేయడం..
ఫోటోస్పాట్ : స్మార్ట్‌ఫోన్ ఉన్న వారిలో అందరూ వాట్సాప్ యాప్‌ను వాడుతున్నారు. కంపెనీ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ.. సరికొత్త అప్‌డేట్లతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వాట్సాప్ అంటేనే క్షణాల్లో మెసెజెస్ సెండ్ చేయడం.. రిసీవ్ కావడం వంటివి జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనం తెలిసో తెలియక కొన్ని తప్పు మెసెజ్‌లను పంపుతూ ఉంటాం. అయితే అలా పంపిన వాటిని డిలీట్ చేసి.. మళ్లీ కొత్తగా టైప్ చేసి మెసెజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. ఆ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్ కొత్త అప్‌డేట్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ ‘ఎడిట్’ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్ వల్ల మెసెజ్ పంపిన(send) తర్వాత దాదాపు 15 నిమిషాల్లోపు దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ద్వారా మీరు పంపిన మెసెజ్‌లో ఏదైనా తప్పులు, స్పెల్లింగ్ మిస్టెక్స్ వంటివి ఉంటే మెసెజ్ సెండ్ అయిన తర్వాత ఎడిట్ చేయొచ్చు.వాట్సాప్ స్టేటస్‌ను డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోనూ షేర్ చేయొచ్చు...ప్రస్తుతం మనం వాడుతున్న వాట్సాప్ యాప్‌లో ఇప్పటివరకు ఎడిట్ మెసెజ్ ఫీచర్ లేదు. కేవలం టెక్ట్స్ మెసెజెస్‌కు మాత్రమే ఆప్షన్ ఉండేది. అయితే ఇక నుంచి ఏవైనా ఫోటోలు, వీడియోలు, ఇతర మీడియా టైపు, క్యాప్షన్లను సైతం సెండ్ చేసిన తర్వాత 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకోవచ్చు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?