జగ్గంపేట మండలం లో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము వైభవంగా జరిగింది

ఫోటోస్పాట్ : మన కళ్ళ ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచే, కాలగర్భంలో కలిసిన చరిత్రను మన ముందు ఉంచే, కరిగిపోయే కాలానికి చెరిగిపోని సాక్ష్యం ఫోటో. అయిన184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము సందర్భంగా శనివారం కాకినాడ జిల్లా ,జగ్గంపేట మండలం, జి కొత్తూరు, దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జగ్గంపేట మండలం ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంచాల హేమాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది

Aug 19, 2023 - 14:33
Aug 19, 2023 - 14:38
 0  449
జగ్గంపేట మండలం లో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము వైభవంగా జరిగింది

ఫోటోస్పాట్ : మన కళ్ళ ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచే, కాలగర్భంలో కలిసిన చరిత్రను మన ముందు ఉంచే, కరిగిపోయే కాలానికి చెరిగిపోని సాక్ష్యం ఫోటో. అయిన184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము సందర్భంగా శనివారం కాకినాడ జిల్లా ,జగ్గంపేట మండలం, జి కొత్తూరు, దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జగ్గంపేట మండలం ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంచాల హేమాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సైలా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్   ఢాగురే చిత్రపటానికి  పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఆడప గోవింద్, గంజా శివన్నారాయణ, మనుగుల రామకృష్ణ, ప్రత్తి శ్రీనివాస్  లను సాలు వాలతో సన్మానించి, పూలమాలలు వేసి జ్ఞాపికలు అందజేశారు. ఫోటోగ్రాఫర్లు అందరూ ఒకరికొకరు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సందక పద్మనాభం,  వ్యవస్థాపక అధ్యక్షులు సైల శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులు మంచాల హేమాద్రి ప్రసాద్,  సెక్రటరీ నకి రెడ్డి విష్ణు, ట్రెజరర్ గడ్డం అచ్చిరాజు మండలంలోని ఫోటోగ్రాఫర్లు అందరూ పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow