TPVPA స్వరక్షా పరివార్ ఒకరికొకరం తోడునీడగా
తెలంగాణ ఫోటో & విడిగ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ ఆ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బృహత్తర పథకం.

స్వరక్షా పరివార్ ఒకరికొకరం తోడునీడగా తెలంగాణ ఫోటో & విడిగ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ ఆ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బృహత్తర పథకం. స్వరక్షా పరివార్ విశేషాలు:
01. కేవలం ఒక్క రూపాయితో ఫొటోగ్రాఫర్లు ఈ పథకంలో చేరే అవకాశం.
02. స్వరక్షా పరివార్ సభ్యుల సహకారంతొ 18 నుండి 56 సంవత్సరాల వయసు నిండిన స్వరక్షా పరివార్ సభ్యుడు మరణించినట్లైతే వారి కుటుంబానికి కనీసం ₹1,00,001/- (లక్ష ఒక్క రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం. భవిష్యత్తులో ఈ సహాయం రెండు లక్షలకు పెంచడం.
03. 56 నుండి 60 సంత్సరాల వయసు నిండిన స్వరక్షా పరివార్ సభ్యులు మరణించినట్లైతే వారి కుటుంబానికి ₹50,001 (యాభై వేల ఒక్క రూపాయలు) ఆర్థిక సహాయం.
04. మెరిట్ సాధించిన స్వరక్షా పరివార్ సభ్యుల పిల్లలకు ₹5,001/- నుండి 10,001/- ప్రోత్సాహకం అందించడం.
05. స్వరక్షా పరివార్ సభ్యుడి కూతురు వివాహానికి ₹10,001/- ఆర్ధిక సహాయం.
06. అవసరం ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో తగిన సహకారం అందించడం.
07. ఆరోగ్య మరియు జీవిత భీమాల పట్ల పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది.
08. సహకారం అందించిన వారి వివరాలు TPVPA ప్రత్యేక యాప్ లో సభ్యులు చూసుకునే అవకాశం.
09. కేవలం స్వరక్షా పరివార్ సభ్యులే కాకుండ ఎవ్వరు లెక్కలు అడిగినా పారదర్శకంగా చూపించడం జరుగుతుంది.
స్వరక్షా పరివార్ లొ ఎవరెవరు చేరవచ్చు?
01. స్వరక్షా పరివార్ లొ చేరడానికి తప్పని సరిగా ఏదైన ఒక ఫోటోగ్రఫి సంఘంకి చెందిన వారై ఉండాలి. నమోదు సమయంలో మీ యొక్క సంఘం ID కార్డ్ తప్పనిసరి.
02. జిల్లా, మండల, ప్రాంతీయ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ స్వఛ్చందంగా ఈ పథకం కొరకు TPVPA తొ అనుసంధానం అయ్యే అవకాశం కల్పించడం జరిగింది.
పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసాక ప్రతి సభ్యుడిని ఫోన్ ద్వారా సంప్రదించి పూర్తి రిజిస్ట్రేషన్ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక 21 రోజుల అనంతరం పథకం ఆ సభ్యుడికి వర్తిస్తుంది.
ప్రీ-రిజిస్ట్రేషన్
https://www.tpvpa.org/swarakshaparivar-pre-registration
ఇట్లు
TPVPA రాష్ట్ర కమిటీ
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






