ఫోటో గ్రఫీ రంగం లోని కళామతల్లి ముద్దుబిడ్డలకి తెలంగాణా ఫోటోగ్రఫీ మిత్రులకు అందరికి ఎడిట్ పాయింట్ రమేష్ బహిరంగ లేఖ !!

ఎడిట్ పాయింట్ ఇండియా మొదలైన దగ్గర్నుంచి గత 21 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా ఆదరిస్తున్న ఆప్త మిత్రులు , శ్రేయోభిలాషులు , ట్రేడర్స్ అందరికి పేరు పేరునా ప్రతి ఒక్కరికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ బహిరంగ లేఖ రాస్తున్నాను..

Feb 9, 2024 - 01:18
 1  414
ఫోటో గ్రఫీ రంగం లోని కళామతల్లి ముద్దుబిడ్డలకి తెలంగాణా ఫోటోగ్రఫీ మిత్రులకు అందరికి ఎడిట్ పాయింట్ రమేష్ బహిరంగ లేఖ !!

ఫోటో గ్రఫీ రంగం లోని కళామతల్లి ముద్దుబిడ్డలకి తెలంగాణా ఫోటోగ్రఫీ మిత్రులకు అందరికి ఎడిట్ పాయింట్ రమేష్ బహిరంగ లేఖ !!

ఎడిట్ పాయింట్ ఇండియా మొదలైన దగ్గర్నుంచి గత 21 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా ఆదరిస్తున్న ఆప్త మిత్రులు , శ్రేయోభిలాషులు , ట్రేడర్స్ అందరికి పేరు పేరునా ప్రతి ఒక్కరికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ బహిరంగ లేఖ రాస్తున్నాను.  ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో తెలంగాణలోనే అతిపెద్ద ఎక్స్పో హైదరాబాదు ఫోటోఫిన ను నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే ఇప్పుడు 2024 సంవత్సరం మనకు ఏప్రిల్లో సీజన్ ఉండటం వల్ల మే నెల 18-19 తేదీలో కాకినాడ అలాగే మే 25-26-27 హైదరాబాద్ చేయాలని చాలామందితో చెప్పడం కూడా జరిగింది. అయితే తొమ్మిదవ తేదీన డేట్స్ రిలీజ్ చేస్తున్నాను అని సోషల్ మీడియా లో 7వ తేదీన నేను పెట్టిన పోస్ట్  తెలిసి 8వ తేదీనే ఇంకో ఎక్స్పో  డేట్స్ రిలీజ్ వచ్చాయి. అది రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో. సరే ఏదైనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనసా వాచః  కర్మణః పాటించే నేను . ఈరోజు వరకు సంఘం లోని కొంత మంది వారి స్వార్థం కోసం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పల్లెత్తు మాట అనకుండా నా పనేదో నేను చేసుకుంటూ మీ అందరితో సంతోషం గా ప్రేమగా ఉన్నాను.  అందరం ఫోటోకళామతల్లి ముద్దు బిడ్డలం  అందరూ బతకాలి నాలుగు రూపాయలు సంపాదించాలని కోరుకునే వ్యక్తిగా సంఘం లో ఉంటూ అల్ ఇండియా ఫోటోగ్రఫి అసోసియేషన్ ( PPAI ) కి pro గా పనిచేస్తున్న నేను సంఘ గౌరవం కాపాడటం కోసం తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్ ఐక్యత కోసం మన ఫోటో ఫిన ఎక్స్పో ని నవంబర్ చివరివారం ( 29-30-డిసెంబర్ 01 తేదీలోకి ) మారుస్తూ నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయానికి ట్రేడర్లు శ్రేయోభిలాషులు మిత్రులు అసోసియేషన్ పెద్దలు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎప్పటికప్పుడు నూతన ఒరవడి తీసుకురావడం లో ముందు ఉండే ఎడిట్ పాయింట్ ఇండియా ఈ సారి కూడా ఫోటో గ్రఫీ రంగంలో సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తోంది మరి కొద్దిగా లేటుగా ఎక్స్పో నిర్వహిస్తున్నాము  కాబట్టి నన్ను మన్నించి ఎప్పటిలాగానే  నన్ను నా కుటుంబాన్ని ఆదరించి ఇలాగే సహాయ సహకారాలు అందించి  మె లో ఉన్న కాకినాడ ఎక్స్పో విజయవంతం చేసి నవంబర్ లో మనం చేయబోయే హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎక్స్పో విజయవంతం చేయాలనీ ప్రతి ఒక్కరిని కూడా పేరుపేరునా కోరుకుంటూ 

మీ ఎడిట్ పాయింట్ రమేష్

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow