న్యాచుర‌ల్ ఫోటో కాంటెస్ట్ గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌

ఫోటోస్పాట్ : ఆగ‌ష్టు 19వ తేదీన ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా  దిపెద్దాపురం ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పెద్దాపురం చిల్ర్డ‌న్ క్ల‌బ్ (పిసిసి) ఆధ్వ‌ర్యంలో న్యాచుర‌ల్ ఫోటో కాంటెస్ట్ ఏర్పాటు చేసారు

Aug 1, 2024 - 13:46
 0  174
న్యాచుర‌ల్ ఫోటో కాంటెస్ట్ గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌

ఫోటోస్పాట్ : ఆగ‌ష్టు 19వ తేదీన ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా  దిపెద్దాపురం ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పెద్దాపురం చిల్ర్డ‌న్ క్ల‌బ్ (పిసిసి) ఆధ్వ‌ర్యంలో న్యాచుర‌ల్ ఫోటో కాంటెస్ట్ ఏర్పాటు చేసారు. దీనికి సంబందించిన గోడ‌ప‌త్రిక‌ను సూర్యారావు భ‌వ‌న్‌లో ఆవిష్క‌రించారు. ఫోటో గ్రాఫ‌ర్స్ యూనియ‌న్ అధ్య‌క్షులు వ‌ర‌హాల‌రాజు, పిసిసి గౌర‌వాధ్య‌క్షులు బుద్దా శ్రీ‌నివాస్ గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ చేసారు. ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని విద్యార్ధుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితియ్య‌డానికి చిన్న ప్ర‌య‌త్నంగా ఈ పోటీల‌ను భావిస్తున్నామ‌ని అన్నారు. ఒక చిత్రాన్ని ఒక్క‌క్క‌రు ఒకోర‌కంగా చూస్తార‌ని వారి చూసే కోణం కూడా  ఈ చిత్రాల్లో ప్ర‌స్పుష్టం అవుతుంద‌న్నారు. తీసిన ఫోటోలు అన్ని కూడా 7901697939 నెంబ‌ర్‌కు ఆగ‌ష్టు 12వ తేదీ నాటికి డాక్యుమెంట్ ఫైల్లో పంపించాల‌ని కోరారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న ఫోటోలు అన్నింటిని ప్రింట్ చేయించి ప్రద‌ర్శ‌న  ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. 6,7 త‌ర‌గ‌తుల విద్యార్ధులు జూనియ‌ర్స్‌గా, 8,9,10 త‌ర‌గ‌తుల విద్యార్ధులు సీనియ‌ర్స్‌గా, ఇంట‌ర్ విద్యార్ధులు సూప‌ర్ సీనియ‌ర్స్‌గా పోటీలు ఉంటాయ‌ని తెలిపారు. గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌లో చిల్డ్ర‌న్ క్ల‌బ్ అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు కూనిరెడ్డి అరుణ‌, రొంగ‌ల అరుణ్, నేహా, బంగారం, ఫోటో స్టూడియో యూనియ‌న్ నాయ‌కులు రెడ్డి, ర‌మ‌ణ‌, బ‌ళ్ళ స‌తీష్, సాహితీ స్ర‌వంతి గౌర‌వాధ్య‌క్షులు చ‌ల్లా విశ్వ‌నాథం త‌దిత‌ర‌లు పాల్గోన్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow