MLA శ్రీ ప్రభాకర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఫోటోఫిన 2023 ఆవిష్కరణ

ఫోటోస్పాట్ :  తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యం తో వీవ్ మీడియాస్ , పొట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో సినీ మరియు బుల్లి తెర రంగాల లో 24 విభాగాలలో కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు సౌత్ టీవీ అవార్డ్స్

Mar 27, 2023 - 17:11
 0  86
MLA శ్రీ ప్రభాకర్ గౌడ్ గారి  చేతుల మీదుగా ఫోటోఫిన 2023 ఆవిష్కరణ

ఫోటోస్పాట్ :  తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యం తో వీవ్ మీడియాస్ , పొట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో సినీ మరియు బుల్లి తెర రంగాల లో 24 విభాగాలలో కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు సౌత్ టీవీ అవార్డ్స్ అందించబోతున్నరు.ఈ కార్యక్రమానికి గౌరవ రాజేంద్ర నగర్ నియోజక వర్గ శాసన సభా సభ్యులు శ్రీ. టి. ప్రకాశ్ గౌడ్ గారిని ముఖ్య అతిథి గా ఆహ్వానించడానికి వీవ్ మీడియా చైర్మన్ కొప్పుల వసుంధర, పొట్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎం. డి. పోట్ల శ్రీనివాసులు మరియు బి.ఆర్.ఎస్ మాణీకొండ మున్సిపాలిటీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ మరియు రుసి ఫౌండేషన్ ఛైర్పర్సన్ పట్లోల్ల రుపా రెడ్డి    తదితరులు స్థానిక  ఎమ్మెల్యే గారి కార్యాలయం లో కలవడం జరిగింది.గత పది సవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో ఏప్రిల్ 27,28,29 తేదీలలో జరిగే అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎక్స్పో ఫోటోఫిన లో సినీ రంగమే కాకుండా వివిధ రంగాల ప్రముఖులను కూడా సత్కరిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నరాన్న విషయం విన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గారు ఈ కార్యక్రమ ప్రారంభానికి  తప్పక విచ్చేస్తానని  మాటిస్తూ.. కళాకారులను గౌరవించడమే కాకుండా  దాదాపు 5లక్షల విలువైన జీవిత భీమా మరియు ఆరోగ్య భీమా అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు కొప్పుల వసుంధర ను సౌత్ టీవీ టీమ్ ను అభినందిచారు.నార్సింగ్ లోని ది అడ్రస్ కన్వెన్షన్ హాల్ నందు ఏప్రిల్ 27, 28 మరియు 29  తేది లలో జరిగే అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎక్స్పో ఫోటోఫిన కార్యక్రమం లో అవార్డ్ లతో పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇంటర్నేషనల్ ఎక్స్పో లో స్టాల్స్, ఫుడ్ ఫెస్ట్, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు మూడు రోజుల పాటు ఉంటాయని, ఈవెంట్ కు హాజరు కావాలన్న ,అవార్డ్స్ నామినేషన్ కోసం ఫోటోఫిన వెబ్సైట్ చూడాలని ఆర్గనైజర్ తెలిపారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow