ఛలో సిద్దిపేట కార్యక్రమం విజయవంతం
ఫోటోస్పాట్ : సిద్దిపేటలో సహస్ర గ్రాఫిక్స్ వారు తక్కువ ధరలకు ఫోటో ఫ్రేమ్స్ ఇస్తూ, దీనిని సామాజిక మాద్యమాలలో అనగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దీనివల్ల సిద్దిపేట మరియు సిద్దిపేట పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల జీవితాలకు చాలా నష్టం జరుగుతుంది
ఫోటోస్పాట్ : సిద్దిపేటలో సహస్ర గ్రాఫిక్స్ వారు తక్కువ ధరలకు ఫోటో ఫ్రేమ్స్ ఇస్తూ, దీనిని సామాజిక మాద్యమాలలో అనగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దీనివల్ల సిద్దిపేట మరియు సిద్దిపేట పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల జీవితాలకు చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయమై సిద్దిపేట చుట్టూ పక్కల ప్రాంతాల నుండి దాదాపు 40 నుంచి 50 మంది ఫోటోగ్రాఫర్లు, హైద్రాబాద్ నుంచి వచ్చిన సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఈరోజు సహస్ర గ్రాఫిక్స్ వారిని కలిసి సామరస్యంగా మాట్లాడి, ఫోటోగ్రాఫర్ల పరిస్థితిని, వృత్తి విలువల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి, ఇకనుండి ఇలాంటి ఆఫర్లు పెట్టమని, ఫోటోగ్రాఫర్లకు నష్టం కలిగించే రేట్లకు ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో వాళ్లు చేసిన పోస్టులను కూడా రిమూవ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వీరే కాదు ఇలాంటి వారు ఎవరైనా ఫోటోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఫోటోగ్రఫీ సంఘాలు తప్పకుండా స్పందించాలి.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి రామకృష్ణ చారి గారు, కె. ప్రభాకర్ రెడ్డి గారు, సిద్దిపేట మరియు పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లు పల్లె వెంకట్, బొజ్జ రవి కుమార్, కాసోడి రమేష్, ఆర్యన్ బాబు, పిట్ల ఎల్లం, కె.రాజేందర్, నాంపెల్లి ఖన్నా, దొరిగి వెంకటేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?