జిల్లా స్థాయి ఫోటోగ్రఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేత నస్పూర్

 ఫొటోస్పాట్ : మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్  అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన జిల్లా స్థాయి సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో మంచిర్యాల జిల్లా నుండి మొత్తం 12 జట్లు పాల్గొనగా నస్పూర్- బెల్లంపల్లి జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి.

Jul 8, 2024 - 19:32
 0  75
జిల్లా స్థాయి ఫోటోగ్రఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేత నస్పూర్

 ఫొటోస్పాట్ : మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్  అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన జిల్లా స్థాయి సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో మంచిర్యాల జిల్లా నుండి మొత్తం 12 జట్లు పాల్గొనగా నస్పూర్- బెల్లంపల్లి జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. సోమవారం శ్రీరాంపూర్ లోని కృష్ణ కాలనీ శాంతి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నస్పూర్ నస్పూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 92 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెల్లంపల్లి జట్టు 64 పరుగులు చేసి అలౌట్ అయింది. విన్నర్స్ గా నిలిచిన నస్పూర్ జట్టులో చిన్న సుధాకర్ చక్కటి ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు. విన్నర్స్,  రన్నర్స్ జట్లకు మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్ల సతీష్  మాట్లాడుతూ క్రీడలు మానసికొల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  మానసిక ఒత్తిడిని జయించడానికి ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో అందరూ క్రీడాస్ఫూర్తితో ఆటలు కొనసాగించడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గని రవీందర్, కోశాధికారి శ్రీపతి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకయ్య గౌడ్,  ఆర్గనైజర్స్ ముక్కెర శ్రీను, చిన్న సుధాకర్, నూనె సురేష్,  సాంబారు రాము, లడ్డ సాయి, మేరుగు భానుప్రకాష్,  అభిలాశ్ రెడ్డి, జిల్లాలోని పలు  మండలాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow