టెక్నికల్ రివ్యూ ఖైదినంబర్ 150

సాంకేతిక అంశాలు

దేవిశ్రీ ప్రసాద్ చిరు ప్రధానంగా అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే మ్యూజిక్ ఇచ్చాడు. రత్నవేలు గతంలో చేసిన సినిమాల్లో లాగా కెమెరా పనితనం అంత ప్రత్యేకంగా అనిపించదు కానీ.. సినిమాకు రిచ్ లుక్ మాత్రం తీసుకొచ్చింది. ఆద్యంతం కలర్ ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. చిరును రత్నవేలు చాలా బాగా చూపించాడు. పాటల చిత్రీకరణలోనూ రత్నవేలు ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

సినిమాకు మాటలు పరుచూరి బ్రదర్స్.. సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి కలిసి అందించారు. రైతు సమస్యల నేపథ్యంలో వచ్చే మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక దర్శకుడు వి.వి.వినాయక్ విషయానికి వస్తే.. అతను చిరు కోరుకున్నట్లు సినిమా తీసి పెట్టాడు. ‘కత్తి’ సినిమాకు తనదైన కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మూల కథను మార్చలేదు కానీ.. కామెడీ.. కమర్షియల్ హంగులు అద్దాడు. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేశాడతను. అవి కొంత వరకు కథాగమనానికి అడ్డం పడ్డాయి. వినాయక్ ఇచ్చిన కమర్షియల్ టచ్ వల్ల మెగా అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ‘ఖైదీ నెంబర్ 150’ చేరువ కావచ్చు. ఐతే కథను సిన్సియర్ గా చెప్పే విషయంలో మాతృక ‘ఖైదీ నెంబర్ 150’ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

సేకరణ: tupaki.com

Leave a Reply

*