టెక్నికల్ రివ్యూ గౌతమిపుత్ర శాతకర్ణి

సాంకేతిక అంశాలు:

సాంకేతికంగా ఈ సినిమాకి వందకి వంద మార్కులు వేయాల్సిందే. సుదీర్ఘంగా, భారీ తారాగణం నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాలున్నప్పటికీ దర్శకుడు ఎంతో సహజంగా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిజంగా జరుగుతున్న రణ రంగానికి మనం సాక్షులుగా ఉన్నామా అనిపిస్తుంటుంది. కొన్నిచోట్ల శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా కలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల బలం ప్రస్ఫుటంగా కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధ సన్నివేశాలకి దీటుగా.. ప్రతి మాటా ఓ తూటాలా పేలిపోతుంటుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం, సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు… ఇలా వేటికమే సాటి అన్పిస్తాయి. ఇంతటి భారీదనంతో కూడిన చిత్రాన్ని 79 రోజుల్లో తీశారంటే చిత్రబృందాన్ని మెచ్చుకోవల్సిందే.

సేకరణ:dailyhunt

Leave a Reply

*