ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇమేజింగ్ అవార్డులు-2017లలో కెనాన్ కి పలు అవార్డులు

ఫోటోస్పాట్: స్మార్ట్ ఫోటోగ్రఫీ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇమేజింగ్ అవార్డులు-2017 లో భాగంగా కెనాన్ పలుకేటగిరీ లలో అవార్డులను కైవసం చేసుకుంది.ఇందులో   EOS 5D Mark IV  – “బెస్ట్ ఫుల్ ఫ్రేమ్ DSLR ఆఫ్ ది ఇయర్” మరియు స్మార్ట్ ఫోటోగ్రఫీ “కెమెరా ఆఫ్ ది ఇయర్” అవార్డులని గెలుచుకుంది. EF16-35 f/2.8 III USM లెన్స్  – స్మార్ట్ ఫోటోగ్రఫీ “బెస్ట్ వైడ్ యాంగిల్ జూమ్ లెన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుని గెలుచుకుంది. […]

అంగవైకల్యాన్ని జయించిన ఫోటోగ్రాఫర్

ఫోటోస్పాట్: మనసులో సంకల్పం, చేయాలనే కసి, పట్టుదల ఉంటే ఎలాంటి పని అయిన చేయోచ్చని, అంగవైకల్యం అడ్డుకాదని ఒక ఫోటోగ్రాఫర్ నిరూపించాడు. ఒక ఫోటోగ్రఫీ మిత్రుడు ఈ వీడియోని ముఖపుస్తకంలో పోస్ట్ చేశాడు. అన్ని సక్రమంగా ఉండి ఏ పని సరిగ్గా చేయనటువంటి సమర్థులు ఉన్న ఈ నాదేశంలో నీవంటి ఒక ఆదర్శమూర్తి ఎంతో అవసరం, ఫోటోస్పాట్ నీకు సలాం చేస్తూ ఈ వీడియోని ఆనందంగా పోస్ట్ చేస్తుంది. https://www.facebook.com/kodalistudio/videos/1308457089242247/

దశరథ కుమార్ గారికి ఆత్మీయ సన్మానం

ఫోటోస్పాట్: IBC న్యూస్ భాస్కర్-శైలజ గారి ఆధ్వర్యంలో మరియు  జయమిత్ర వారి సహకారంతో ప్రముఖ ఛాయా చిత్రకారులు, ఫోటోగ్రఫీ పితామహులు శ్రీ పొట్టబత్తిని ధశరధ కుమార్ గారి ఫోటోగ్రఫీ జీవితాన్ని వారు తీసిన ఛాయాచిత్రాలతో రంగరించి ఒక వీడియో చిత్రాన్ని తయారుచేసి ఫిబ్రవరి 16 గురువారం రోజున లయన్స్ క్లబ్, నల్గొండలో అందరి సమక్షంలో విడుదలచేసి ప్రదర్శించారు. అనంతరం వారికీ ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నల్గొండ  ఫోటోగ్రాఫర్లు, లయన్స్ క్లబ్ […]

పీఎస్‌ఎల్‌వీ-సీ37 లాంచింగ్ సెల్ఫి వీడియో

ఫోటోస్పాట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఫిబ్రవరి 15 ఉద‌యం ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మ‌న దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన  సంగతి తెలిసిందే. ఈ ప్ర‌త్యేక ఘ‌ట్టాన్ని మ‌రింత మ‌ధురం చేయ‌డానికి ISRO ముందుగానే ఒక ఏర్పాటు చేసింది. ఉపగ్రహాలను మోసుకుపోయిన పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహక నౌకకు హై రిజల్యూషన్‌ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా నుంచి సెల్ఫీ వీడియో అందేలా శాస్త్రవేత్తలు ప్ర‌త్యేక‌ ఏర్పాటు చేశారు. ఈ వీడియోను ఇస్రో నిన్న […]

హైదరాబాద్ లో మూడవ ఎక్స్పీరియన్స్ జోన్ ని ప్రారంభించిన నికాన్

ఫోటోస్పాట్: ఇటివలే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నికాన్ సంస్థ ఈ రోజు హైదరాబాద్ లో తమ మూడవ ఎక్స్పీరియన్స్ జోన్ ని ప్రారంభించింది. నికాన్ ఇండియా యండి. శ్రీ కజౌ నినోమియా మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీ జితేందర్ చుగ్ చేతులమీదుగా జ్యోతి స్టూడియో , ఆర్.పి.రోడ్, సికింద్రాబాద్ వద్ద ప్రారంభించడం జరిగింది. తద్వారా ప్రపంచశ్రేణి ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణభారతదేశంలో ఇది 26వ జోన్ అని నిర్వాహకులు తెలిపారు.అనంతరం యండి నినోమియా […]

కెమెరా దొంగ దొరికాడు

ఫోటోస్పాట్: ఫిబ్రవరి 15న బుధవారం రోజున, శేషసాయి కళ్యాణమండపం నందు రాత్రి కెమెరా బ్యాగులు 2 దొంగలించబడినవి. వెంటనే గుర్తించి నిఘా కెమెరా ఫుటేజ్ ని పరిశీలించి దొంగను గుర్తించి రెండవ పట్టణ పోలీసు వారికి అప్పగించడం జరిగిందని అతని వద్దనున్న బ్యాగుల్లో పరిశీలించగా వస్తువులు కనిపించలేదని పోలీస్ వారి సహకారంతో వెతకగా రోడ్డు ప్రక్కన మురికి కాలువల్లోపడేశాడని, కొన్ని వస్తువులు దొరకగా మరికొన్ని దొరకలేదని. కావున ఫోటో & వీడియోగ్రాఫర్లు వారి వారి వస్తువుల విషయంలో […]

ప్రారంభమైన ఫోటోస్పాట్ యాప్

ఫోటోస్పాట్: అతి తక్కువ కాలంలోనే మీ అందరి ఆదరణ, అభిమానాలు, ప్రశంసలు పొందిన ఫోటోస్పాట్ ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు ఫోటోస్పాట్ చైర్మెన్ శ్రీ ఇప్పలపల్లి రమేష్ సతీమణి శ్రీమతి ఇప్పలపల్లి శైలజ గారి పుట్టినరోజు సందర్భంగా ఎడిట్ పాయింట్ ఆఫీసులో ఫోటోస్పాట్ యాప్ ని ఆవిష్కరించారు. 1 లేదా 2 రోజుల్లో ఈ యాప్ ప్లే స్టోర్ లో మీ ముందుకు రాబోతుంది. ఇవే ఆదరాభిమానాలు పొందుతూ ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని […]

ఘనంగా ప్రారంభమైన నికాన్ ఎక్స్పీరియన్స్ జోన్

ఫోటోస్పాట్: నికాన్ సంస్థ కరీంనగర్ లో నికాన్ ఎక్స్ పీరియన్స్ జోన్ ని ప్రారంభం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం మహాగణేష్ ఎంటర్ ప్రైజెస్ నందు నికాన్ సంస్థ ప్రతినిధులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా నికాన్ యం.డి నినోమియా సన్ గారు మరియు సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. నికాన్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ఫోటో & వీడియోగ్రాఫర్లు హాజరయ్యరని నిర్వాహకులు తెలిపారు.

జయహో భారత్ – దేశం మీసం తిప్పింది

ఫోటోస్పాట్: ఇస్రో చ‌రిత్ర సృష్టించింది. ఒకే రాకెట్‌లో ఏకంగా 104 ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి పంపించి దేశం మీసం తిప్పింది. సంబందిత నిర్దేశిత క‌క్ష‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టింది. ఉద‌యం 9గంట‌ల 28 నిమిషాల‌కు నిప్పులు క‌క్కుతూ నింగిలోకి ఎగిసింది పీఎస్ఎల్‌వీ సీ-37. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో ఈ ప్ర‌యోగం పూర్తి చేసింది. ఈ ప్ర‌యోగంతో ఇస్రో మ‌రో మెట్టు అధిగ‌మించింది. అంత‌రిక్ష ప్ర‌యోగంలో అమెరికా ర‌ష్యాల‌ను అధిగ‌మించింది. ప్రపంచ దేశాలకు భారతదేశం సత్తా చాటింది.అమెరికాకు చెందిన 96 ఉప‌గ్ర‌హాలు,ఇజ్రాయెల్‌, […]

ఆకృతి డిజిప్రెస్ మొదటి వార్షికోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్: ఆకృతి డిజిప్రెస్ సికింద్రాబాద్ శాఖ వారు మొదటి వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఆకృతి డిజిప్రెస్ శాఖ సికింద్రాబాద్ లో నెలకొల్పి 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి సబరాలు జరుపుకున్నారు. ఆకృతి డిజిప్రెస్ సికింద్రాబాద్ వారికి ఫోటోస్పాట్ నుండి శుభాకాంక్షలు.

ఘనంగా ప్రారంభమైన శ్రీ వినాయక స్టూడియో

ఫోటోస్పాట్: ఫిబ్రవరి 13 సోమవారం రోజున మార్కాపురంనందు శ్రీ వినాయక స్టూడియోని ప్రారంభించడం జరిగింది. స్థానిక మార్కాపురం శాసనసభ్యులు శ్రీ జంకె వెంకటరెడ్డి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్టూడియోని ప్రారంభించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమాలలో అయన పాల్గొన్నారు.నూతనంగా నెలకొల్పిన టి-షర్టు, మగ్ ప్రింటింగ్ , గిఫ్ట్ ఆర్టికల్స్, ఐ.డి.కార్డ్ లామినేషన్ కి మంచి స్పందన లభించింది. అధిక సంఖ్యలో తోటి ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారని వినాయక స్టూడియో అధిపతి జంకె శంకర్ […]

విశాఖ కేంద్రంగా సినీరంగ అభివృద్ది – జీసిసి యం.డి రవిప్రకాష్

ఫోటోస్పాట్: విశాఖ కేంద్రంగా సినిరంగం అభివృద్దికి అనేక అవకాశాలున్నాయని గిరిజన కార్పొరేషన్ మేనజింగ్ డైరెక్టర్ ఆకెళ్ళ రవిప్రకాష్ అన్నారు.శనివారం ద్వారకానగర్ లోని పౌరగ్రంధాలయంలో కాస్మిక్ సినీ క్లబ్, వీవీగ్రూపు, విజేఎఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ ని అయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో గల అటవీ, గిరిజన ప్రాంతాల్లో అనేక అందమైన లోకేషన్లు చిత్రీకరణకు అణువుగా ఉన్నాయన్నారు. అరకు, లంబ సింగి లాంటి ప్రాంతాల్ని ఆంధ్రా […]

Success @ చిట్-చాట్ విత్ PHOTRIYA వెంకి

ఫోటోస్పాట్: హైదరాబాద్ డిజిటల్ ఫోటోగ్రఫీ క్లబ్ (HDPC) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 ఆదివారం రోజున బిర్లా సైన్స్ ఆడిటోరియం నిర్వహించిన కమర్షియల్ ఫోటోగ్రఫీ  ఫర్ బిగినర్స్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఫోట్రియ వెంకి విచ్చేసి తమ అనుభవాలను, అనుభూతులను ఔత్సాహికులతో పంచుకున్నారు, పలువురు ఫోటోగ్రాఫర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇదే కార్యక్రమంలో కాన్వేరా ఆల్బమ్ టెక్నికల్ డెమో ఇచ్చిన టీం కి HDPC ధన్యవాదాలు తెలిపారు.

25000 మంది మిత్రులు సందర్శించారు

ఫోటో స్పాట్ : ప్రారంభించిన రెండు నెలల్లో మాకు ఎంతో  సహకరించిన ఆశిర్వదించిన మిత్రులకి , శ్రేయోభిలశులకి , అసోసియేషన్ పెద్దలకి , ట్రేడర్స్ కి మరియు ఫేస్బుక్ అధినేత ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు … ఇంకా మునుముందు మీ సలహాలు సూచనలు ఎంతో అవసరం తెలుగు లో టెక్నాలజీ అందించడానికి … మేకు తెలిసిన ఎ టెక్నాలజీ సమాచారాన్ని తోటి మిత్రులకి తెలియచేస్తారని ఆశిస్తూ   సదా మీ సేవలో […]