ఏప్రిల్ లో కోయంబత్తూర్ COVA EXPO -2017

ఫోటోస్పాట్: కోయంబత్తూర్ జిల్లా వీడియో & ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వీడియో, ఫోటో & ఆల్బమ్ ట్రేడ్ ఫెయిర్ (COVA Expo -2017) ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21,22,23వ తేదిలలో మూడు రోజులపాటు కడిస్సియా ట్రేడ్ ఫెయిర్ కాంప్లెక్స్ నందు ఈ ట్రేడ్ ఫెయిర్ కొనసాగుతుందని కోయంబత్తూర్ అసోసియేషన్ తెలపడం జరిగింది. ఈ ట్రేడ్ ఫెయిర్ ని తమిళనాడు, కేరళ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మరియు సౌత్ ఇండియా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ బలపరుస్తున్నారు. కావున […]

ఏప్రిల్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ కి ఎన్నికలు

ఫోటోస్పాట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు ఏప్రిల్ 2న  నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిటి నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించింది.అధ్యక్ష పదవి నామినేషన్ కి చివరి తేది మార్చి ౩1.  నామినేషన్ రుసుము రూ.50౦౦/- మరియు కనీసం రెండు సంవత్సరాలు అసోసియేషన్ కమిటిలో పనిచేసిన అనుభవం ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాత్కాలిక కమిటి మరియు అనుసంధాన మండల కమిటి సభ్యులకు మాత్రమే ఎన్నికల సమావేశానికి […]

NVFF-2017 లో ప్రముఖులచే సెమినార్స్ & ఫ్యాషన్ షోస్

ఫోటోస్పాట్: ఈ నెల 21,22,23 వ తేదిలలో ముంబైలోని బొంబాయి ఎక్సిబిషన్ సెంటర్ లో జరిగే నేషనల్ వీడియో ఫోటో ఫెయిర్ 2017 నందు ప్రముఖులచే  మూడు రోజులపాటు సెమినార్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సెమినార్స్ లో ఫోటోగ్రఫీ టెక్నిక్స్ మరియు లైటింగ్ టెక్నిక్స్, బిసినెస్ డెవలప్ మెంట్, సినిమాటోగ్రఫి బేసిక్స్ వంటి వాటిపై సెమినార్స్ తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రముఖ మోడల్స్ తో మూడు రోజులపాటు ఫ్యాషన్ షో నిర్వహించనున్నారు.మనదేశంతో పాటు విదేశాలలోని ఫోటో & వీడియో […]

ఏప్రిల్ మొదటివారంలో ఒడిస్సా ఫోటోట్రేడ్ షో – 2017

ఫోటోస్పాట్: ఎడిట్ పాయింట్, ఫోటోటెక్ మరియు SDL  సంయుక్తంగా ఏప్రిల్ 3, 4, 5 తేదిలలో ఒడిస్సా ఫోటోట్రేడ్ షో  -2017 ని నిర్వహించనున్నారు. ఫోటో & వీడియోగ్రఫీ రంగానికి మరియు వాటి అనుబంధరంగాలకి సంబందించిన అన్ని రకాల ఉత్పత్తులు ఈ ట్రేడ్ షో లో కొలువుదీరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.నికాన్,సోని, కెనాన్, పానసోనిక్, Epson, jvc, HP లాంటి జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు ఈ ట్రేడ్ షో లో పాల్గొంటున్నాయి. మార్కెట్లోకి విడుదలైన లేటెస్ట్ టెక్నాలజీ […]

పాపికొండలు మరియు పట్టిసీమలలో ఫ్రెండ్లీ టూర్ వర్క్ షాప్

ఫోటోస్పాట్: ఈ నెల 24, 25, 26వ తేదిలలో పాపికొండలు మరియు పట్టిసీమలలో ఫ్రెండ్లీ టూర్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు హుస్సేన్ ఖాన్ మరియు కుమారస్వామిలు తెలిపారు. నిన్న ఈ వర్క్ షాప్ కి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వెంకటపతిరాజు, కుమారస్వామి మరియు సభ్యులు పాల్గొన్నారు. కావున ఆసక్తి కల ఫోటోగ్రాఫర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గోనవచ్చునని తెలిపారు. పరిమిత సీట్లు కలవు. […]

వరంగల్ లో నికాన్ FX డెమో వర్క్ షాప్

ఫోటోస్పాట్: వరంగల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకి శుభవార్త. మీ యొక్క కెమెరా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. నికాన్ కంపెనీ వారు  ఈ నెల 22న వరంగల్ లోని  హోటల్ అశోక నందు ఉదయం 10గం|| లనుండి నికాన్ FX కెమెరా మరియు లెన్స్ లపై డెమో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. కావున ఆసక్తిగల ఫోటోగ్రాఫర్లు తమ తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నికాన్ ప్రతినిధులు కోరారు. పరిమిత సీట్లు కలవు. రిజిస్ట్రేషన్ కై సంప్రదించాల్సిన నంబర్  రంజిత్ కుమార్ 9885030184.

కరీంనగర్ లో నికాన్ FX డెమో వర్క్ షాప్

ఫోటోస్పాట్: కరీంనగర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకి శుభవార్త. మీ యొక్క కెమెరా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. నికాన్ కంపెనీ వారు  ఈ నెల 21న కరీంనగర్ లోని  కొండా సత్యలక్ష్మి గార్డెన్స్ నందు ఉదయం 10గం|| లనుండి నికాన్ FX కెమెరా మరియు లెన్స్ లపై డెమో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. కావున ఆసక్తిగల ఫోటోగ్రాఫర్లు తమ తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నికాన్ ప్రతినిధులు కోరారు. పరిమిత సీట్లు కలవు. రిజిస్ట్రేషన్ కై సంప్రదించాల్సిన నంబర్  రంజిత్ […]

నిజామాబాద్ లో నికాన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : ఈ నెల 19 న నిజామబాద్ లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు నికాన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ phulong x’రోడ్ లో గల వంశీ ఇంటర్నేషనల్ లో ఉదయం 9.30గం|| లనుండి సాయంత్రం 5.30గం|| ల వరకు నిర్వహించనున్నారు. పరిమిత సీట్లు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300. కావున ఆసక్తిగల ఫోటోగ్రాఫర్లు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా నికాన్ ప్రతినిధులు కోరడమైనది. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాల్సిన నంబర్: […]

ముంబాయి లో నేషనల్ వీడియో ఫోటో ఫెయిర్-2017

ఫోటోస్పాట్: దేశంలోనే అతిపెద్ద ఫోటో ఫెయిర్ ఈ నెల 21,22,23 వ తేదిలలో ముంబైలోని బొంబాయి ఎక్సిబిషన్ సెంటర్ లో జరగనుంది. మనదేశంతో పాటు విదేశాలలోని ఫోటో & వీడియో రంగానికి  మరియు వాటి అనుబంధ రంగాలకు సంబధించిన అన్ని రకాల కంపనీలు ఇక్కడ మూడు రోజుల పాటు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోనే మాస్టర్ గా పేరుగడించిన శ్రీ రాజు సుల్తానియా గారు విచ్చేసి ప్రారంభం చేయనున్నారు. కావున ఫోటో & […]

హైదరాబాద్ లో క్రియేటివ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ :అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ల పర్యవేక్షణలో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ల కోసం ” సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ-హైదరాబాద్ ‘ మరియు ” బిర్లా సైన్సు సెంటర్-హైదరాబాద్” లు సంయుక్తంగా రెండు రోజుల పాటు ” క్రియేటివ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్’ ను ఏప్రిల్ 1 మరియు 2 తేదీలలో ”బిర్లా సైన్సు సెంటర్” లో నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు ఫ్యాకల్టిలుగా శ్రీ బి.కె.అగర్వాల్ (VIZAG), ప్రితేష్ రావు (MUMBAI) కెనాన్ మెంటర్ గౌతం అగర్వాల్, కె.ప్రభాకర్ […]

పుణేలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్: మార్చి 15న పుణేలో స్టార్ట్ ఫోటోబుక్ మరియు ఇన్ డాట్ ఫోటోబుక్ వారి ఆధ్వర్యంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వర్క్ షాప్ నందు కెమెరా గురించి, ఫిల్మ్ వేర్ అప్డేట్స్, మార్కెట్ ఎలా చేసుకోవాలి? లైటింగ్ టెక్నిక్స్ మరియు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ టిప్స్ వంటి వాటిని వివరించడం జరుగుతుంది. ఆసక్తి గల ఫోటోగ్రాఫర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన వచ్చును. మరిన్ని వివరాలకు సంప్రదించండి: సుమేష్ 07030901337, సంజయ్: […]

మార్చి 8న గుంటూరులో R.K Digipress ప్రారంభోత్సవం

ఫోటోస్పాట్ : గత 33 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ, డిజిటల్ మరియు ప్లెక్స్ రంగంలో సేవలందిస్తున్న ఆర్.కె.గ్రూప్స్ వారు మరో ముందడుగుతో  నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో మొట్టమొదటి సరిగా డబుల్ సైడ్ ప్రింటింగ్ సిస్టమ్ ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 8న అరుండాల్ పేట గుంటూరు నందు స్థానిక  గుంటూరు వెస్ట్ శాసనసభ్యులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి, మరియు గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తఫా గార్లు ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవం జరగనుంది. కావున పెద్ద సంఖ్యలో […]

ఉమెన్స్ డే స్పెషల్: మహిళలకు ఎడిటింగ్/డిజైనింగ్ లో ఉచిత శిక్షణ

ఫోటోస్పాట్: ఫోటోగ్రఫీ రంగంలో రాణించాలి అనే కోరిక  ఉన్నటువంటి మహిళా మణులందరికి ఎడిట్ పాయింట్  ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భం గా ఎడిట్ పాయింట్ డిజైనింగ్ లేదా ఎడిటింగ్ లో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణ ఎడిట్ పాయింట్ శాఖలైన విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్  మరియు ఖమ్మం లలో  ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల  మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉచిత శిక్షణ కోసం సంప్రదించండి. ఫోన్-9246598649.040 27504649  

పానసోనిక్ వారి 4K ఇమేజ్ కాంటెస్ట్

ఫోటోస్పాట్: మొదటిసారిగా పానసోనిక్ 4K ఇమేజ్ కాంటెస్ట్ చేపట్టింది. ఇందులో మీరు తీసిన బెస్ట్ బ్లాక్ & వైట్  4K ఫోటోలని అప్ లోడ్ చేసి కాంటెస్ట్ లో పాల్గొనవచ్చును. రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. http://the4kimagingclub.com/Register.aspx