సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ (SAP) ఆధ్వర్యంలో మరో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ @ అరకు వ్యాలీ

ఫోటోస్పాట్:  ” సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో 21వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ @ అరకు వ్యాలీ లో నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ వర్క్ షాప్ కి భారీగా ఫోటో ఆర్టిస్టుల నుండి స్పందన లభించింది.  ఇంతటి విశేష స్పందన కారణంగా మరొక workshop ని ప్రారంభిస్తూ…22వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను తేది: 12-12-2017 నుండి 14-12-2017 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వర్క్ షాప్ […]

నవంబర్ 24న సికింద్రాబాద్ లో ప్రారంభం కానున్న కెనాన్ ఇమేజ్ స్క్వేర్ షో రూమ్

ఫోటోస్పాట్:  ఫోటోగ్రాఫర్లందరికి చేరువలో టచ్ ఫీల్ అయ్యే విధంగా కెనాన్ సంస్థ వారు తమ ఇమేజ్ స్క్వేర్ ని నవంబర్ 24న మధ్యాహ్నం 1గంటకి సికింద్రాబాద్ RP రోడ్ లో గల రాజేశ్వర చాంబర్స్ నందు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కెనాన్ సంస్థ యొక్క సౌత్ రీజినల్ బిజినెస్ హెడ్ విజయ్ కుమార్ గారు హాజరుకానున్నారు. కెమెరా కొనాలనుకునే వారు ఇమేజ్ స్క్వేర్ ని సందర్శించి కెనాన్ కి సంబందించిన అన్ని రకాల మోడళ్ళ వివరాలను పని తీరును స్వయంగా […]

నవంబర్ 22న పలాసలో సృష్టి-ఐక్యత అసోసియేషన్ కార్యవర్గంచే ఫోటోగూడ్స్ షోరూం ప్రారంభం

ఫోటోస్పాట్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గలో నవ్య డిజిటల్ అధినేత జి. జానకిరావు గతంలో ఉన్న స్టూడియో, వీడియో మిక్సింగ్, ఫ్లెక్స్ సెంటర్ల (నవ్య డిజిటల్) లో నవంబర్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఫోటో గూడ్స్ షోరూంను నూతనంగా ప్రారంభించుచున్నట్లు ఆయన తెలిపారు. సృష్టి-ఐక్యత ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ అధ్యక్షులు వి. గోపిక్రిష్ణ మరియు కార్యవర్గంచే ప్రారంభోత్సవము జరుపుచున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లు ఫోటోగూడ్స్ విషయమై చాలా ఇబ్బందులు పడటం తాను […]

నవంబర్ 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో “శ్రీ లిపి” తెలుగు ఫాంట్స్ సాఫ్ట్‌వేర్ ఉచిత డెమో

ఫోటోస్పాట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు కొత్తగూడెం టౌన్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 21వ తేది మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు ధారా ఫంక్షన్ హాల్, లక్ష్మిదేవిపల్లి కొత్తగూడెం నందు “శ్రీ లిపి” తెలుగు ఫాంట్స్ సాఫ్ట్‌వేర్ ఉచిత డెమో (తెలుగులో)ని ఏర్పాటుచేయనున్నట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కావున ఫోటో & వీడియోగ్రాఫర్స్ మిత్రులు అందరూ కుడా ఈ సదావకాశాన్ని వినియోగించుటకు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు […]

నవంబర్ 14న కొత్తగూడెంలో నికాన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

ఫోటోస్పాట్: కొత్తగూడెం పరిసర ప్రాంత ఫోటో & వీడియోగ్రాఫర్లకు శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రముఖ ఫ్యాకల్టీ, నికాన్ మెంటర్ శ్రీ యస్.కె.హుస్సేన్ గారిచే  ఇటివలే వందేళ్ళు పూర్తిచేసుకున్న నికాన్ సంస్థ వారు నవంబర్ 14 మంగళవారం రోజున కొత్తగూడెంలోనిహోటల్ సూర్యాప్యాలెస్ నందు  ఉదయం 9.00 గంటల నుండి  వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ని నిర్వహించనున్నారు. కావున ఆసక్తి గల ఫోటోగ్రాఫర్లు  తమ తమ పేర్లను నవంబర్ 13లోపు నమోదు చేసుకొని ఈ […]

నవంబర్ 10,11వ తేదిలలో విజయవాడ నందు కెనాన్ ప్రింటర్స్ లైవ్ డెమో

ఫోటోస్పాట్:  నవంబర్ 10, 11వ తేదిలలో విజయవాడ MG రోడ్ లో గల The Gateway Hotel నందు కెనాన్ ప్రింటర్స్ లైవ్ డెమో ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ లైవ్ డెమో నవంబర్ 10వ తేదిన మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7గంటల వరకు, నవంబర్ 11వ తేదిన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వెంకట్, cell: 8008940404.

నవంబర్ 16,17,18వ తేదిలలో హైదరాబాద్ లో ఐరిస్ సత్యం గారి ఫోటోగ్రఫి వర్క్ షాప్

ఫోటోస్పాట్: ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ ఐరిస్ సత్యం గారి ఆధ్వర్యంలో నవంబర్ 16,17,18వ తేదిలలో మూడు రోజులపాటు హైదరాబాద్ నందు ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇండోర్ మరియు ఔట్ డోర్ లలో ప్రాక్టికల్స్ తో పాటు థియరీ కూడా చెప్పనున్నారు. లైటింగ్, క్యాండిడ్ షూట్, స్పాట్ ఫోకస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మెనూ ఆపరేటింగ్ మరియు మొదలగు అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. రిజిస్ట్రేషన్ కి ఆఖరు తేది నవంబర్ […]

నవంబర్ 7వ తేదిన ఖమ్మం నగర ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

ఫోటోస్పాట్: ఖమ్మం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం నగర ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నవంబర్ 7వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం లోని స్టేషన్ రోడ్ నందు గల హోటల్ శాంతిలో జరుగునని, కావున నగర పరిధిలోని అందరూ ఫోటో & వీడియోగ్రాఫర్స్ సభ్యత్వం వున్న వారు మరియు కొత్తగా సభ్యత్వం తీసుకునే వారు సకాలంలో హాజరు కావాలని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే రోజు […]

అక్టోబర్ 29వ తేదిన నంద్యాలలో విరాట్ డిజిప్రెస్ వారి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్: నంద్యాల ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో విరాట్ డిజిప్రెస్ వారి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ని  అక్టోబర్ 29వ తేదిన నంద్యాల ఆత్మకూర్ బస్టాండ్ నందు గల ఎన్.టి.ఆర్. షాదిఖానా లో ప్రముఖ ఫ్యాకల్టీ, సీనియర్ ఫోటోగ్రాఫర్ విజయవాడకి చెందిన స్పాట్ షాట్ శేఖర్ గారిచే నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఆసక్తి గల ఫోటో & వీడియోగ్రాఫర్లు ఈ వర్క్ షాప్ కి హాజరై మెళకువలు నేర్చుకొని […]

అక్టోబర్ 25న హైదరాబాద్ లో సోనీ వారి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్: అక్టోబర్ 25వ తేదిన సోని కంపెనీ ఆధ్వర్యంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ విల్లార్ట్ రమణ గారిచే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ని హైదరాబాద్ అమీర్ పేట నందు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల ఫోటోగ్రాఫర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు లేదా మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి. నవీన్ కుమార్ సెల్: 9908066299, రూపేష్ సెల్: 9885667143.

అక్టోబర్ 21, 22, 23వ తేదిలలో హైదరాబాద్ లో ఐరిస్ సత్యం గారి ఫోటోగ్రఫి వర్క్ షాప్

ఫోటోస్పాట్: ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ ఐరిస్ సత్యం గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 21, 22, 23వ తేదిలలో మూడు రోజులపాటు హైదరాబాద్ నందు ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇండోర్ మరియు ఔట్ డోర్ లలో ప్రాక్టికల్స్ తో పాటు థియరీ కూడా చెప్పనున్నారు. లైటింగ్, క్యాండిడ్ షూట్, స్పాట్ ఫోకస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మెనూ ఆపరేటింగ్ మరియు మొదలగు అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. రిజిస్ట్రేషన్ కి ఆఖరు […]

అక్టోబర్ 09న తెనాలిలో డిజిటల్ ఫోటో మరియు వీడియోగ్రఫీ వర్క్ షాప్

ఫోటోస్పాట్: తెనాలి లో మొట్టమొదటిసారి “సోనీ” కంపెనీ వారి కెమెరాలతోపాటు, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, ఫ్యాకల్టి శ్రీ స్పాట్ షాట్ శేఖర్ గారితో “డిజిటల్ ఫోటోగ్రఫీ ” అంశం పై , ఫోటోగ్రఫీ మరియు ప్రో కెమెరా నిపుణులు ముస్తఫా బాషా గారితో వీడియోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించ బడుతుంది. కావున తెనాలి పరిసర ప్రాంత ఫొటోగ్రాఫర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సమయం: 09 -10-2017 ఉ.10గం నుండి సా.5 గం వరకు వేదిక: హోటల్ గౌతమ్ గ్రాండ్, […]

సెప్టెంబర్ 26న విజయవాడలో నికాన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

ఫోటోస్పాట్: ఫోటోట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నికాన్ సంస్థవారు సెప్టెంబర్ 26వ తేది మంగళవారం రోజున హోటల్ ఐలాపురం నందు నికాన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ని నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాప్ నందు నికాన్ నూతన ఉత్పత్తులైన D850, D810, D750, D610   లపై లైవ్ డెమో ని ఏర్పాటుచేయనున్నారు.ఆసక్తిగల ఫోటోగ్రాఫర్లు ఈ వర్క్‌షాప్ నందు పాల్గొనవచ్చును. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీనివాసరావు 9849114449, లోవరాజు 8008413366, మారియో 9246262904.

అక్టోబర్ 1న శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో యస్.ఆర్.డిజిటల్ ప్లెక్స్ సెంటర్ ప్రారంభం

ఫోటోస్పాట్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గలో అక్టోబర్ 01, 2017 ఆదివారం నాడు ఉదయం గం.08–47 ని.లకు కాశీబుగ్గ 3రోడ్ల జంక్షన్ దగ్గరలో యస్.ఆర్.డిజిటల్ ప్లెక్స్ ప్రింటింగ్ నూతనంగా ప్రారంభిస్తున్నట్లు సెంటర్ అధినేత మాజీ అధ్యక్షులు యస్.జయరాం గారు తెలిపారు. నార్మల్, మీడియం స్టార్, స్టార్, వినైల్ స్టిక్కర్, ఫ్రంట్-లైట్, బ్యాక్-లైట్, వన్-వే విజన్ మొదలగు మీడియాల పై క్వాలిటీ ప్రింట్స్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. నూతన ప్రారంభోత్సవం సందర్భముగా సృష్టి-ఐక్యత ఫోటో & వీడియోగ్రాఫర్స్ […]