ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ధవళేశ్వరం అసోసియేషన్ ఆర్థిక సహయం

ఫోటోస్పాట్: ఇటివలే స్వర్గస్థులైన కి.శే. శ్రీ బైనపాలపు సాయిరామ్ గారికి ధవళేశ్వరం ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో అంజలి ఘటించారు. మార్చి 26న నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొని సాయిరామ్ గారితో ఉన్నమధుర స్మృతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరుపునుండి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు.ఆపద కాలంలో ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకున్న ధవళేశ్వరం ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన భరోసా అభినందనీయం.

ప్రతి ఫోటోగ్రాఫర్ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా అధ్యక్షుడు రామారెడ్డి

ఫోటోస్పాట్ : ఫోటో,వీడీయోగ్రాఫర్లు ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఫోటో,వీడియో గ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి అన్నారు. సోమవారం కె.గంగవరం మండల ఫొటోవీడియో గ్రాఫర్ల సర్వసభ్య సమావేశం శ్రీముఖ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సంఘం లోని ప్రతీ సభ్యుడు ప్రధాని అటల్ భీమా యోజన పథకంలో చేరాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న కాపు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల రుణాల్లో 25 […]

ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో ప్రథమ బహుమతి గెల్చుకున్న చంద్రశేఖర్

ఫోటోస్పాట్: మార్చి 24,25,26 తేదీలలో పాపికొండలు మరియు పట్టిసీమ ప్రాంతాల్లో జరిగిన ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో పాల్వంచకి చెందిన ఫోటోగ్రాఫర్ పి. చంద్రశేఖర్ పోటిలలో ప్రథమ బహుమతి గెల్చుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులైన హుస్సేన్ ఖాన్ AFIAP,F FIPP, కుమారస్వామి AFIAP ,FFIP గారికి ధన్యవాదాలు తెలిపారు.Congraulation shekhar and All the best…    

ఎన్నికైన PTWA నూతన కమిటి

ఫోటోస్పాట్: మార్చి 25 న జరిగిన PTWA అసోసియేషన్ కార్య వర్గ సమావేశంలో నూతన కమిటిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పౌండర్ మెంబర్స్ అయినటువంటి శ్రీ జానకిరామ్ గారు అద్యక్షులు గా మరియు డి.వి.ఎస్ గారు కార్యధర్శిగా, ట్రెజరర్ గా  శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజులు PTWA అసోసియేషన్ అద్యక్షులు గా భాద్యతలు నిర్వహించిన శ్రీ మాదల రమేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుండి ఈ నూతన అసోసియేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మణుగూరు మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటి ఎన్నిక

ఫోటోస్పాట్: ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో మణుగూరు మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటిని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటి అధ్యక్షులుగా పూర్ణచంద్రరావు గారు మరియు ప్రధానకార్యదర్శి గా కృష్ణమోహన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ తాత్కాలిక కార్యదర్శి వెంకటపతిరాజు మరియు జిల్లాకి సంబందించిన పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రమణ

ఫోటోస్పాట్: మార్చి 24,25,26 తేదీలలో పాపికొండలు మరియు పట్టిసీమ ప్రాంతాల్లో జరిగిన ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో విజయవాడ నివాసి అయినటువంటి  ఫోటోగ్రాఫర్ రమణ గొల్లమూడి పోటిలలో ద్వితీయ బహుమతి గెల్చుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులైన హుస్సేన్ ఖాన్ AFIAP,F FIPP, కుమారస్వామి AFIAP ,FFIP గారికి ధన్యవాదాలు తెలిపారు.Congraulation Ramana and All the best…  

ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో తృతీయ బహుమతి గెల్చుకున్న శివకుమార్

ఫోటోస్పాట్: మార్చి 24,25,26 తేదీలలో పాపికొండలు మరియు పట్టిసీమ ప్రాంతాల్లో జరిగిన ఫ్రెండ్లీ టూర్ కార్యక్రమంలో మంగళగిరి నివాసి అయినటువంటి  ఫోటోగ్రాఫర్ జి. శివకుమార్ పోటిలలో తృతీయ బహుమతి గెల్చుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులైన హుస్సేన్ ఖాన్ AFIAP,F FIPP, కుమారస్వామి AFIAP ,FFIP గారికి ధన్యవాదాలు తెలిపారు.Congraulation shiva kumar and All the best…

నేషనల్ వీడియో ఫోటో ఫెయిర్ – 2017 హైలైట్స్

ఫోటోస్పాట్: దేశంలోనే అతిపెద్ద ఫోటో ఫెయిర్ ఈ నెల 21,22,23 వ తేదిలలో ముంబైలోని బొంబాయి ఎక్సిబిషన్ సెంటర్ లో జరిగింది. మనదేశంతో పాటు విదేశాలలోని ఫోటో & వీడియో రంగానికి  మరియు వాటి అనుబంధ రంగాలకు సంబధించిన అన్ని రకాల కంపనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం యొక్క విశేషాలు మీ కోసం.

గ్రేటర్ వరంగల్ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కి కమ్యూనిటీ హాల్ మంజూరుకోసం కలెక్టర్ కి వినతి

ఫోటోస్పాట్: గ్రేటర్ వరంగల్ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కి  కమ్యూనిటీహాల్ మంజూరు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు రంగు సదానందం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ ని కలిసి వినితి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, ఫొటో ప్రదర్శన, వర్క్ షాప్ కార్యక్రమాలు, సర్వసభ్య సమావేశాలు, ఫొటోగ్రఫీ దినోత్సవం లాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. అందుకుగాను మాకు కమ్యూనిటీహాల్ కోసం ప్రభుత్వ స్థలం ఇప్పించి మంజూరు చేయాలని కోరారు. […]

Success@పాపికొండలు మరియు పట్టిసీమ ఫ్రెండ్లీ టూర్ వర్క్ షాప్

ఫోటోస్పాట్: ఈ నెల 24, 25, 26వ తేదిలలో పాపికొండలు మరియు పట్టిసీమలలో నిర్వహించిన  ఫ్రెండ్లీ టూర్ వర్క్ షాప్ కి మంచి ఆదరణ లభించింది. చాలా మంది ఫోటోగ్రాఫర్లు హాజరై తమ ప్రతిభను కనబరిచినట్లు నిర్వాహకులు హుస్సేన్ ఖాన్ మరియు కుమారస్వామిలు తెలిపారు. పాపికొండలు ప్రెండ్లీ టూర్ వర్క్ షాప్ విశేషాలు మీకోసం…

టి.ఎస్.ఆర్.టి.సి చైర్మెన్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్: మార్చి 26 ఆదివారం రోజున గోదావరిఖని ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్.టి.సి. చైర్మెన్ శ్రీ సోమారపు సత్యనారాయణ గారి చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం క్యాలెండర్-2017 ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరిఖని అసోసియేషన్ చాలా సమర్దవంతంగా పని చేస్తుందని ఫోటోగ్రాఫర్లు అందరు ఐకమత్యంగా ఉండి వారి భవిష్యత్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని […]

తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రఫీ పరిశ్రమ ప్రముఖుల అధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ కి ఎన్నికలు

ఫోటోస్పాట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏప్రిల్ 2వ తేదిన పాల్వంచ లోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్న సంగతి ఇప్పటికే మనకు విదితమే. ఈ ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల నుండి ఫోటోగ్రఫీ పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు తాత్కాలిక కమిటి సభ్యులు అతిధుల వివరాలను ప్రకటించడం జరిగింది. వారి అధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి […]

కాటమరాయుడు రివ్యూ బై ఐడ్రీమ్స్

ఫోటోస్పాట్: సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు : ఇది పవన్‌కల్యాణ్ స‌ినిమా..! త‌నదైన శైలి, స్టైల్‌తో జ‌నాన్ని క‌ట్టిప‌డేసే ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌-2తో నిరాశ‌ప‌డిన‌ త‌న‌ అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించ‌డం కోసం తీసిన సినిమా. ఈ ప్ర‌య‌త్నంలో పవన్ పూర్తిస్థాయిలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి. ఈ చిత్ర‌ క‌థ‌ను హీరో బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా మ‌లుచుకున్న విధానం ద‌ర్శ‌కుడు డాలి ప్ర‌తిభ‌ను చాటిచెప్పేదే..! ప‌వ‌న్ నుంచి అభిమానులు ఏ కోరుకుంటారో అచ్చంగా అలాగే హీరో పాత్ర‌ను తీర్చిదిద్దడం, […]

ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమి & స్టేట్ ఫోటోజర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణరావు కి సన్మానం

ఫోటోస్పాట్: కేంద్ర ప్రభుత్వం ఫొటో డివిజన్ నుండి 22 మార్చి రాత్రి న్యూఢిల్లీలో మన ఫొటోజర్నలిస్ట్ సి.హెచ్. నారాయణ రావు అవార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. దేశం మొత్తం మీద ఎంపిక చేయబడ్డ 5గురిలో ఒకరుగా నారాయణ ఎంపిక పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ఛాయాచిత్రకారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమి మరియు స్టేట్ ఫోటోజర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా వారిని అభినందించదలచి, 23.3.2017 గురువారం సాయంత్రం కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & […]